telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నమ్మరాదు… పూర్తిగా వదులుకోరాదు

ఎవర్నీ ఎక్కువగా నమ్మరాదు
ఎవర్నీ పూర్తిగా వదులుకోరాదు
ఎవరి తలమీద కూర్చోరాదు
ఎవరి కాలుక్రింద పడరాదు
ఎవర్నీ పైనుంచి క్రిందదాక రక్షణ అనుకోరాదు
ఎవరైనా నావాళ్లే అని మాటలు కలపరాదు
ఎవరికైనా అలుసు అయ్యేలా వెన్న పూయరాదు
ఎవరి దయకు ఒక భిక్షుకుడిలా లొంగిపోరాదు
ఎవ్వరికీ తలవొంచి తగ్గరాదు
ఎవ్వ రి చేతలకు అతిగా భయపడరాదు
ఎవ్వరి పైనపడి బ్రతుకు గడపరాదు
ఎవ్వరిని తిరగబడి ద్వేషించరాదు
ఎవ్వరితో విరగబడి ఏమి చెప్పుకోరాదు
ఎవ్వరిని ఎక్కువగా ఏవి అడగరాదు
ఎవ్వరితో వ్యక్తి లేనప్పుడు చెడు చెప్పరాదు
ఎవ్వరికి బోళాశంకరుడిగా ఒట్లువేయరాదు
ఎవరితో అంతరిక సమస్యలు చెప్పుకోరాదు
ఎప్పుడు జీవితం తాడుమీద నడక
ఎప్పుడు ఉండాలి ఓర్పు,నియమాలు పాటించాలి
ఎవ్వరి పైన ఎగిరి అరిచే తత్వం ఉండరాదు
క్రిందకు జారిపడిపోకుండా జాగ్రత్తపడు
బంధాలనేవి బ్రతుకులో త్రాసులాంటివి
జీవించు చెకుముకి రాయిలా నిత్యం నిరంతరం
ఇవే ప్రభల నీతి రీతి వచనాలు వినుమా!

Related posts