telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అధికారులు కూడా .. ఇలా గోడలు దూకి .. రేపటి సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నారు .. : మమత

mamata-banerjee

చిదంబరాన్ని అరెస్టు చేయడం కోసం దర్యాప్తు సంస్థలు వ్యవహరించిన తీరును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. దిల్లీలో చిదంబరం నివాసం వద్ద సీబీఐ అధికారులు బుధవారం సాయంత్రం ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఇంట్లోకి ప్రవేశించడానికి కొందరు అధికారులు గోడలు కూడా దూకారు. చిదంబరం అరెస్టు విషయంలో అధికారులు వ్యవహరించిన తీరు చాలా నిరుత్సాహపరిచింది. అది చాలా చెడ్డగా, బాధగా అనిపించింది.. అని మమత గురువారం కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

కొన్నిసార్లు అనుసరించే విధానాలు తప్పుగా ఉంటాయి. నేను ఆ కేసు గురించి మాట్లాడటం లేదు. చిదంబరం ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు. ఈ దేశానికి హోం, ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు.. అని మమత పేర్కొన్నారు. చిదంబరం అరెస్టుపై చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘సీబీఐ అధికారులు గోడలు దూకి, చిదంబరాన్ని అరెస్టు చేయడాన్ని నేను చూశాను. ఆ వ్యవహారం సిగ్గుచేటు. ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కానీ ఇప్పుడు ఆయన్ను అరెస్టు చేశారు. ఇది ఖండించదగింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts