జీహెచ్ఎంసీ ప్రతీ శుక్రవారాన్నీ హరిత శుక్రవారంగా పాటించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే… తొలి శుక్రవారం(23 వ తేదీ) పెద్దెఎత్తున రోజంతా మొక్కలు నాటడం, మొక్కలను నగరవాసులకు ఉచితంగా పంపిణీ చేయడం చేయాలని నిర్ణయించారు. ఇక ప్రతీ శుక్రవారం స్వచ్ఛ ఆటోలు, ఎంటమాలజీ, అర్బన్ బయోడైవర్సిటీ, ఇంజనీరింగ్ విభాగాల వద్ద ఉన్న వాహనాల ద్వారా నర్సరీల నుంచి మొక్కలను తరలించి ఇంటింటికీ పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏరియా కమిటీలు, స్వయం సహాయక బృందాలు, సీనియర్ సిటిజన్లను హరితహారంలో భాగస్వాములుగా చేయాలని నిర్ణయించారు. ప్రముఖులు, ప్రముఖ క్రీడాకారులు, సెలబ్రటీలను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేయాలని నిర్ణయించారు. ప్రతీ శుక్రవారం ఒక్కో సర్కిల్‌లో కనీసం 50 వేల మొక్కలను నాటడం, ఉచితంగా పంపిణీ చేయడం చేయాలని నిర్ణయించారు.