విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కోహ్లీ న్యూలుక్ అంటూ ప్రచారంలోకి వచ్చిన ఈ ఫొటోలో భారత కెప్టెన్ పసుపు టీ- షర్టులో గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో కళ్లద్దాలు పెట్టుకుని కనిపించాడు. కోహ్లీకి సంబంధించిన ఈ నయాలుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలోని కోహ్లీ నెట్‌ఫ్లిక్స్ ప్రముఖ వెబ్‌సిరీస్ ‘మనీ హైస్ట్’లోని ఫ్రొఫెసర్‌లా ఉన్నాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. వాళ్ల ఇద్దరి ఫొటోలు పక్కపక్కన పెట్టి షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ప్రిపరేషన్‌లో భాగంగా కోహ్లీ ఇలా తయారయ్యాడని కామెంట్ చేస్తున్నారు. అయితే అభిమానులను ఇంతలా ఆకట్టుకున్న ఆ ఫొటో ఫేక్ అని తెలిసింది. కోహ్లీపై ఉన్న ప్రేమతో ఓ అభిమాని ఎడిట్ చేసిన ఫొటోనని స్పష్టమైంది. ఇక ఐపీఎల్ 2021 సీజన్ అర్దంతరంగా వాయిదాపడటంతో ఇంటికి చేరుకున్న కోహ్లీ.. భార్య అనుష్క శర్మతో కలిసి కోవిడ్-19పై పోరుకై ఫండ్‌రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టాడు. తమవంతుగా రూ.2 కోట్ల విరాళాన్ని కూడా అందజేశాడు. mప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు సిద్దమవుతున్న కోహ్లీ.. ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశించాడు. జూన్ 2 ఇంగ్లండ్‌లో అడుగుపెట్టనున్న భారత జట్టు.. జూన్ 18 నుంచి 22 వరకు న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో పాల్గొననుంది.
previous post
షరీఫ్ నిర్ణయం వెనుక చంద్రబాబు: కొడాలి నాని