telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గల్ఫ్ పై దాడులు.. చమురు కోసమేనా.. యుద్ధవాతావరణం ..

oil war situations in gulf

రోజు రోజుకు గల్ఫ్ లో పరిణామాలు దారుణంగా మారిపోతున్నాయి. ఇరాన్, సౌదీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో యుద్ధం తప్పదని కొందరు చెప్తున్నారు. ఒకవేళ తమ భూభాగంలోకి సౌదీ, అమెరికాకు సంబంధించిన ఎలాంటి విమానాలు, క్షిపణులు ప్రవేశించినా.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే ఇరాన్ స్పష్టం చేసింది. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇరాన్ రివల్యూషనరీ ఆర్మీ పేర్కొన్నది. తమ భూభాగంలోని అరాంకో చమురు శుద్ధి కర్మాగారంపై దాడి జరగడాన్ని అమెరికా కూడా తప్పుపట్టింది. అమెరికాకు మిత్ర దేశం సౌదీ అరేబియా. అమెరికాకు సంబంధించిన ఆయుధాలను కొనుగోలు చేసే దేశాల్లో సౌదీ ముందు ఉంటుంది.

ఇప్పటికే సౌదీలో అమెరికా ఓ ఎయిర్ బేస్ ను కూడా ఏర్పాటు చేసింది. సౌదీ చుట్టూ 8 ప్రాంతాల్లో అమెరికా పేట్రియాటిక్ క్షిపణులు మోహరించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది. అమెరికా, సౌదీ వార్నింగ్, దానికి ఇరాన్ కౌంటర్ తో ప్రస్తుతం గల్ఫ్ లో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. యుద్ధం రాకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ, చూస్తుంటే మాత్రం యుద్ధం వచ్చేలా ఉన్నది. ఒకవేళ ప్రపంచ యుద్ధం వస్తే అది చమురు కోసమే యుద్ధం జరుగుతుందని గతంలో చాలామంది పేర్కొన్నారు. ఇప్పుడు గల్ఫ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. అది నిజమేనేమో అనిపిస్తోంది. ప్రపంచ యుద్ధం చమురు కారణంగానే వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ అది నిజమైతే.. వేరు గెలుస్తారు అని చెప్పేందుకు ప్రపంచంలో మనిషి మిగిలి ఉంటాడని అనుకోవడం లేదు. అలా జరగకుండా ఉండాలి అంటే, ముందు గల్ఫ్ లో శాంతి భద్రతలు ఉండాలి. ఇరాన్, సౌదీల మధ్య శాంతి చర్చలు జరగాలి. అది జరుగుతుందా చూడాలి.

Related posts