telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మమతా బంపర్‌ ఆఫర్‌..బీజేపీ నేతలను పట్టిస్తే ప్రభుత్వ ఉద్యోగం

ప్రస్తుతం మన దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా… అందులో బెంగాల్‌ ఎన్నికలు రోజు రోజుకు రసవత్తరంగా మారాయి. మమతా సర్కార్‌ ఎలాగైనా కూల్చాలని బీజేపీ పక్క ప్లాన్‌ రెడీ చేస్తోంది. అటు సీఎం మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గాన్నివదిలిపెట్టి నందీగ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ  చేసిన కామెంట్స్‌ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాను ప్రధానిమంత్రి పదవికి గౌరవం ఇస్తానంటూనే ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఉత్తర ప్రదేశ్‌ నుంచి గూండాలను తీసుకొస్తున్నారంటూ మమతా ఫైర్‌ అయ్యారు. డబ్బులు పంచి ఓట్లను కొనాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్న సమచారం తనకు ఉందని.. పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీ ట్రాప్‌ పడవద్దని ఆమె కోరారు. డబ్బులు పంచే బీజేపీ నేతలను నిలదీయాలని.. వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని తెలిపారు. డబ్బులు పంచే బీజేపీ లీడర్లను పట్టుకున్న బెంగాల్‌ పౌరులకు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తానని.. రాబోయే ఎన్నికల్లో గెలవగానే వారికి ఈ హామీని నెరవేరుస్తానని మమతా బెనర్జీ ప్రకటించారు. దీంతో బెంగాల్‌ ఎన్నికలు మరింత హాట్‌ హాట్‌గా మారిపోయాయి. కాగా.. కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ మళ్లీ తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలో వస్తుందని చెప్పగా.. మరికొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఏమో.. బీజేపీ ఘన విజయం సాధిస్తుందని తెల్చాయి.

Related posts