telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అందరూ నిర్దోషులైతే మసీదును కూల్చిందెవరు?: ఒవైసీ

asaduddin owisi

బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు తుది తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న 32 మందిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అభియోగాలను రుజువు చేసేందుకు సరైన సాక్ష్యాధారాలను సీబీఐ చూపలేకపోయిందని కోర్టు తెలిపింది.

సీబీఐ కోర్ట్ తీర్పుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. భారతీయ న్యాయవ్యవస్థకు ఈరోజు ఒక చీకటి రోజు అని అన్నారు. అందరూ నిర్దోషులైతే.. మసీదును కూల్చింది ఎవరని ప్రశ్నించారు. బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా? అని ప్రశించారు. మసీదును ఎవరు కూల్చారో ప్రపంచమంతా చూసిందని అన్నారు. మసీదును కూల్చండి అని ఉమా భారతి నినాదాలు చేశారని చెప్పారు. ఈ తీర్పును వెలువరించడం కోసం ఎంత కాలం కసరత్తు చేశారని అన్నారు. ఈ తీర్పుపై సీబీఐ హైకోర్టును ఆశ్రయించాలని పేర్కొన్నారు.

Related posts