telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బాబును మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తా : అచ్చెన్నాయుడు

achennayudu tdp

టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత అచ్చెన్నాయుడు మొట్ట మొదటిసారిగా చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇన్ని రోజులుగా తనకు ఆరోగ్యం బాగాలేదని..అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చానన్నారు అచ్చెన్నాయుడు. ఇకపై ప్రజాక్షేత్రంలోనే ఉంటానని తెలిపారు. బలహీన వర్గాలను చైతన్య పరిచి ఏకం చేస్తానని..ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగతానని పేర్కొన్నారు. తనకు దక్కిన హోదా బలహీన వర్గాలకు దక్కిన గౌరవం అని..టీడీపీ బలహీన వర్గాలకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. టీడీపీకి పూర్వవైభవం తెచ్చి..చంద్రబాబును మళ్ళీ సీఎంగా గెలిపించేందుకు కృషి చేస్తానని అచ్చెన్న స్పష్టం చేశారు. బీసీలపై నమ్మకంతో పదవి ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెలిపారు అచ్చెన్నాయుడు. కాగా టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పేరు, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్ రమణను ప్రకటించారు.. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. ఇక, 24 మంది సభ్యులతో కొత్త పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేశారు.. 27 మంది సభ్యులతో సెంట్రల్ కమిటీని ప్రకటించారు.. కొత్తగా ప్రకటించిన కమిటీల్లో ఆరుగురిని వైస్‌ ప్రెసిడెంట్లుగా నియమించిన చంద్రబాబు.. సెంట్రల్‌ జనరల్ కమిటీ సభ్యులుగా మరో 8మందిని ప్రకటించారు.

Related posts