telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతులకు పంటనష్ట పరిహారం అందించాలి: నారా లోకేశ్

Lokesh Tdp

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని పలు జిల్లాల్లో రైతుల పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ పేయి లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బురద రాజకీయాలను మాని, ముందు వరద బాధితులను ఆదుకోవాలని అన్నారు. అంచనా నివేదికలను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు పరిహారం అందించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

వరదల కారణంగా లంక గ్రామాలు మునిగిపోయాయని తెలిపారు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. రైతులు సాగుచేసిన పంటలు నష్టపోయారని అన్నారు. ప్రత్తి, మినుము, పసుపు, కంద, అరటి, మిర్చి రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ గారు చెబుతున్న నష్టపరిహారం కేవలం పత్రికల్లో తప్ప, క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదని దుయ్యబట్టారు.

Related posts