పది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో శాశ్వతంగా ఏసీ త్రీటైర్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నారాయణాద్రి, వెంకటాద్రి, సింహపురి, గౌతమి, దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో అదనంగా ఒక కోచ్‌ను ఏసీ త్రీటైర్‌గా మార్చనున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఈ రైళ్లలో ఏసీ టూటైర్, త్రీ టైర్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి.
పెరుగుతున్న ప్రయాణికులకు మరింత సేవలందించేందుకు వీలుగా పైన పేర్కొన్న ప్రతిరైలులో అదనంగా ఒక ఏసీ కోచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి వీటి సేవలు అందుబాటులోకి రానున్నాయి అని తెలిపారు.
నాకు పార్టీలో అవమానం జరుగుతోంది- జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు