telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

బ్రిటన్ లో పెరిగిపోతున్న స్ట్రైన్ కేసులు…

చైనా నుండి వచ్చిన కరోనా నుండి కోలుకోకముందే బ్రిటన్ లో కరోనా స్ట్రైన్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బ్రిటన్ లో ఈ కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి.  పోసిటివ్ కేసులు పెరుగుతుండటంతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలో పెరుగుతున్నది.  పాత వైరస్ తో పాటుగా బ్రిటన్ లో కొత్త స్ట్రైన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  రోజుకు 50 నుంచి 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం లాక్ డౌన్ ను విధించారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది.  ఇక ఇదిలా ఉంటె,బ్రిటన్ లో కరోనా కేసుల వివరాలపై ఓ సర్వేను నిర్వహించారు.  ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.  దేశంలో ప్రతి 50 మందిలో ఒకరికి కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగింది.  అలానే, లండన్ లో ప్రతి 30 మందిలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు సర్వేలో నిర్ధారణ జరిగింది. వైరస్ బారిన పడినప్పటికీ లక్షణాలు లేని వ్యక్తులను గురించే క్రమంలో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అయితే ఈ స్ట్రైన్ కూడా ప్రపంచమంతా వ్యాపించడం ప్రారంభించింది. దాంతో ఇప్పుడు అన్ని దేశాలు ముందుగానే అలర్ట్ అయ్యాయి.

Related posts