telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అభిమాని పై బాలయ్య ఆగ్రహం…

NBK

ఓవైపు సినిమాలో మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు బాలకృష్ణ. అయితే బాలకృష్ణ చాలా మంచి మనిషి కానీ ఆయనకు కోపం ఎక్కువ అనే  విషయం అందరికి తెలుసు. ఇంతకముందు కూడా కొన్నిసార్లు తన పక్కన ఉన్నవారి పై ఫైర్ అవ్వడం మనం చూసాము. అయితే ఇప్పడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యింది. తాజాగా ఈరోజు బాలయ్య తన నియోజకవర్గం అయిన హిందూపురంలో పర్యటించారు. ఆ సందర్బంగా అక్కడ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ అభిమాని ఆయన మాటలకూ అడ్డు వచ్చాడు. అంతే ”ఉష్ ఎవడ్రా అది.. నోరుముయ్” అని మీడియా ముందే అతని పై ఫైర్ అయ్యారు బాలయ్య. అయితే ఒకవైపు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే, రాజకీయాల్లో బిజీ అయ్యారు. అలాగే మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా కూడా బాలయ్య విధులు నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బిబి3 వర్కింగ్ టైటిల్ తో సినిమాను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అలాగే హీరోయిన్ గురించి రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి.

Related posts