telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. నేడు బంగ్లాతో .. ఇంగ్లాండ్ ..

today england and bangladesh match in world cup

ప్రపంచ కప్ లో భాగంగా నేడు మరోసారి బాంగ్లాదేశ్ తో దక్షిణాఫ్రికా తలపడుతుంది. అయితే ఈ లీగ్ లోనే బంగ్లా చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని ఇంగ్లండ్, ..దక్షిణాఫ్రికాపై విజయం గాలివాటం కాదని నిరూపించుకునేందుకు బంగ్లాదేశ్ సిద్ధమయ్యాయి. కార్డిఫ్‌లోని సోఫి యా గార్డెన్ వేదికగా శనివారం ఇరు జట్లు ఢీకొననున్నాయి.

తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అదిరిపోయే ఆటతో బోణీ కొట్టిన ఇం గ్లండ్ రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో అనూహ్యంగా ఓడితే.. మొదటి మ్యాచ్‌లో అదే సఫారీలను సఫా చేసిన బంగ్లా రెండో మ్యాచ్‌లో కివీస్ చేతిలో పో రాడి ఓడింది. 2015 వరల్డ్‌కప్‌లో తమను ఓడించి పరోక్షంగా జట్టు అభ్యున్నతికి బాటలు వేసిన బంగ్లాపై విరుచుకుపడి తమ బ్యాటింగ్ ప్రతాపం చూపాలని మోర్గాన్ సేన భావిస్తున్నది.

ఆ పరాజయంతో క్వార్టర్స్‌కు చేరకుండానే ఇంటి ముఖం పట్టిన ఇంగ్లండ్.. నాలుగేండ్లు తిరిగేసరికి ఐసీసీ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరింది. ఇప్పుడు సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోదిగుతున్న ఇంగ్లిష్ జట్టును మొర్తజా సేన ఎలా అడ్డుకుంటుందనేది ఆసక్తికరం.

Related posts