ఈవీఎంలపై తమ పోరాటం ఈనాటిది కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు . దుర్మార్గుడు అధికారంలోకి రావటానికి ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశాడని చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పోరాటాన్ని ఎవరు ఎలా ప్రచారం చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు… తాము చేసే పోరాటం అందరిలో స్ఫూర్తి నింపుతోందని పేర్కొన్నారు.
ఎన్నికలు పూర్తయినప్పాటికీ ప్రత్యర్ధుల కుట్రలు ముగియలేదన్నారు. ఫలితాలు వెల్లడి అయ్యేదాకా వైసీపీ, బీజేపీ కుట్రలు కొనసాగుతాయన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. మే 1 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్ధుల ఓట్లలో తేడాలు ఉన్నాయని తెలిపారు.
అపవిత్ర కూటమికి.. అవినీతి సర్కార్ కు ముగింపు: బీజేపీ