telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే అలక.. జడ్పీ సమావేశాని డుమ్మా!

Koneru konappa mla

కొమురంభీం జిల్లా జిల్లా పరిషత్ సర్వసభ్యసమావేశానికి సిర్పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డుమ్మా కొట్టారు. గతంలో ఓ సమస్య విషయంలో ప్రభుత్వం సహకరించలేదని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కొమురంభీం జిల్లా సార్సాల ఘటనలో తన సోదరుడుపై ఎఫ్ఆర్వో అనిత పెట్టిన కేసు విషయంలో ప్రభుత్వం తమకు సహకరించలేదని ఆయన వాపోయారు.

సార్షాల ఘటనలో ప్రభుత్వం తన సోదరుడు కోనేరు కృష్ణపై కక్ష పూరితంగా వ్యవహరించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే తనపై దాడి చేశారంటూ కోనేరు కృష్ణపై ఎఫ్ఆర్వో అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు కోనేరు కృష్ణను అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితమే కోనేరు కృష్ణ రిమాండ్ ముగియడంతో విడుదలయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో కొమురం భీం జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డుమ్మా కొట్టారు. కోనప్పతోపాటు ఏడుగురు జెడ్పీటీసీలు, ఏడుగురు ఎంపీపీలు సైతం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరుకాలేదు.

Related posts