telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నగరంలో భారీ వర్షాల వలన చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలి – కమిషనర్ రోనాల్డ్ రోస్

నగరంలో భారీ వర్షాల వలన చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. మియాపూర్ సర్కిల్ లో పటేల్ చెరువు తెగిపోయిన సందర్భంగా మంగళవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తో కలిసి కమిషనర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న చెరువుల వరద పరిస్థితిని గమనించి అప్రమత్తంగా ఉండి ఎప్పటి కప్పుడు లోతట్టు ప్రాంతాలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి పరిధిలో గల చెరువుల కట్ట పునరుద్దరణ, స్లూస్ మరమ్మత్తులు మత్తడి పనుల కోసం 191 పనులను చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. పటేల్ చెరువు స్లూస్ తెగి పోయి పలు కాలనీల్లో వరద వచ్చినందున ముందుగా తెగిపోయిన కట్టను తాత్కాలికంగా మరమ్మత్తులు చేయాలని చెరువులో ఉన్న వరదను మత్తడి ద్వారా పంపించే ఏర్పాటు చేయాలని లేక్స్ ఎస్ సి ని ఆదేశించారు. కమీషనర్ ఆదేశాల మేరకు వెంటనే అధికారులు మరమ్మత్తులు చేపట్టి వరదను కూడా మళ్లించి కాలనీలకు వరద నివారణ కు చర్యలు తీసుకున్నారు.

శేరిలింగపల్లి పల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాట్లాడుతూ… ఒకే రోజు 18 సెంటీమీటర్ల వర్షం కురవడంతో పటేల్ చెరువు తెగిపోయింది. చెరువు కు తాత్కాలికంగా మరమ్మత్తులు చేపట్టారని, నియోజకవర్గం లో లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి తప్ప ఎక్కడా ముంపు గురి కాలేదని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్, లేక్స్ ఎస్ సి ఆనంద్, సర్కిల్ ఇ ఇ శ్రీమతి శ్రీకంటి కౌన్సిలర్ లు శ్రీకాంత్, శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————————————-

– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది

Related posts