telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

*ఎడతెరిఫి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – కమిషనర్ రోనాల్డ్ రోస్*

ఎడతెరిఫి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. మంగళవారం భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించి అధికారులను, సహాయక చర్యలు వేగవంతం చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి వేసిన సందర్భంగా మూసీ పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరం అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించాలన్నారు. నగర వాసులకు సమస్యలు ఎదురైనప్పుడు సహాయం కోసం జిహెచ్ఎంసి హెల్ప్ లైన్ నెంబర్ 04- 2111 1111 గాని, డయల్ 100 కు గాని, ఇ.వి.డి.ఎం Control room 9000113667 నెంబర్లను సంప్రదించాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యావసరం పని ఉంటేనే బయటకు రావాలని కమిషనర్ నగర వాసులను కోరారు.

——————————————————————————————
 
*- సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.*

Related posts