బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ దాడి చేసి, ఫిబ్రవరి 27న పాక్ వాయుసేన ఇండియాపైకి వచ్చినప్పుడు ఓ ఎఫ్-16 విమానాన్ని అభినందన్ కూల్చివేశారు. ఆపై ప్రమాదవశాత్తూ పాక్ సైనికులకు చిక్కి, అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్..తన టీమ్ మొత్తానికీ అరుదైన గుర్తింపును అందించాడు.
అభినందన్ పనిచేస్తున్న 51వ స్క్వాడ్రన్ కు యూనిట్ సైటేషన్ అవార్డు లభించింది. భారత వాయుసేన ప్రారంభమై 87 సంవత్సరాలు గడిచిన సందర్భంగా 8న జరిగే వేడుకల్లో 51వ స్క్వాడ్రన్ తరఫున గ్రూప్ కెప్టెన్ సతీష్ పవార్ అవార్డు అందుకోనున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా అవార్డును అందించనున్నారు.
వైసీపీ శ్రేణులు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు: చంద్రబాబు