telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం కురిసిన వర్షాలకు నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు, కాలనీలలో పర్యటించి సహాయక చర్యలను మేయర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా మేయర్ బల్కంపేట సమీపంలో గల ఫతే నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి క్రింద వరద కలవడంతో మేయర్ వెంటనే జోనల్ కమిషనర్ ఆదేశించారు. అంతే కాకుండా నీటి తొలగింపుకు వెంటనే డి.ఆర్.ఎఫ్ టీమ్ లను పంపించాలని ఈ వి డి ఎం డైరెక్టర్ ను ఆదేశించారు. అక్కడ నుండి మేయర్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తో కలిసి అయోధ్య నగర్, గణేష్ నగర్ లోతట్టు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి తక్షణ చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ ఆదేశించారు.

కాలనీలో పలు ఇళ్లలోకి నీరు రావడంతో వెంటనే వాటర్ పంప్ సెట్ ద్వారా తొలగించాలని వారు కోరడంతో వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే ఏర్పాటు చేసి ఇళ్లలో నీటిని తొలగించేందుకు డి-వాటరింగ్ పంప్ సెట్ ఏర్పాటు చేసి తొలగింపు చర్యలు అధికారులు చేపట్టారు. గణేష్ నగర్ లో పర్యటించి కాలనీ వాసుల సహాయక చర్యల పై మేయర్ భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… ఎస్ ఎన్ డి పి నాలా పనులు చేపట్టిన ప్రదేశాలలో ప్రజలకు ఇబ్బంది లేదని కుత్బుల్లాపూర్ సర్కిల్ వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో వరద వెళ్లేందుకు ఎలాంటి డ్రైనేజీ లేనందున లోతట్టు ప్రాంతాల్లో వరద వస్తుంది అని, వరద ముంపు నివారణ కు బాక్స్ డ్రైన్ మంజూరు చేసినట్లు కాలనీ పై భాగం నుండి నాలా ఉన్నందున అట్టి వరద కూడా కాలనీకి రావడం జరుగుతుంది అని దీన్ని దృష్టిలో పెట్టుకొని అట్టి పనులను కూడా రెండో దశ ఎస్ ఎన్ డి పి ద్వారా మంజూరుకు చర్యలు తీసుకోనున్నట్టు మేయర్ తెలిపారు.

ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె పి వివేకనంద మాట్లాడుతూ… అయోధ్య నగర్ లో సిసి రోడ్డు కంటే ఇల్లు లోతట్టు ఉండడం మూలంగా వర్షం వరద వచ్చినట్టు సొంత స్థలం ఉన్న వారికి గృహ లక్ష్మి పథకం ద్వారా మంజూరు చేస్తామన్నారు.

సెట్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు అప్రమత్తం చేసిన మేయర్

మంగళవారం తెల్లవారుజామున నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నగర వాసులకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. పోలీస్, జిహెచ్ఎంసి శాఖల సమన్వయంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం పని ఉంటేనే బయటకు రావాలని నగరవాసులను మేయర్ కోరారు. ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు రేపటి వరకు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించి నందున నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ కోరారు.

హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల గేట్లు ఎత్తి వేసిన నేపథ్యంలో మూసి నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మేయర్ జోనల్ కమిషనర్ లకు ఆదేశించారు.
హెల్ప్ లైన్ కు వచ్చిన ఫిర్యాదు లు వెంటనే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో పని చేసే అధికారులను మేయర్ ఆదేశించారు.

పునరావాస కేంద్రాలను పరిశీలించిన మేయర్

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల గేట్లు ఎత్తి వేసి నీటి విడుదల చేయడంతో మూసీ పరివాహక లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తం చేశారు. మూసీ నదిపై నిర్మించిన బ్రిడ్జి ల క్రింద నివసిస్తున్న సంచార జీవులు గోషామహల్ చుడిబజార్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. శివాజీ బ్రిడ్జి, ఎం.జె బ్రిడ్జి క్రింద నివాసం ఉంటున్న 16 కుటుంబాలకు చెందిన 42 మందిని పునరావాస కేంద్రానికి ఉదయం తరలించారు.
ఈ సందర్భంగా మేయర్ వారితో ఏర్పాటు చేసిన వసతుల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రంలో అన్ని వసతులు బాగున్నాయి అని బాధితులు మేయర్ కు తెలిపారు.

ఖైరతబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రే మాట్లాడుతూ… రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మూసీ పరివాహక లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు. జంట జలాశయాలు నీటి విడుదల సందర్భంగా జోనల్ పరిధిలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అందులో భాగంగానే పునరావాస కేంద్రంలో 16 కుటుంబాల కు చెందిన 42 మందిని పునరావాస కేంద్రం కు తరలించినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో గోషామహల్ డిసి బాలయ్య, ఏ ఎం అండ్ హెచ్ ఓ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————————————-

– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది

Related posts