telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో లాక్‌డౌన్.. ఎక్కడంటే..?‌

lockdown corona

ఈ ఏడాది ఆరంభం నుండి మన దేశంలో కరోనా కు వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయిన కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ఏపీలో ఒక్క నెల కిందట రోజుకు 100 కు దిగువగా నమోదైన కరోనా కేసులు ఇప్పుడు 1000 కి పైగా నమోదవుతున్నాయి. అయితే ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలులో ఉండనుంది. కరోనా కేసులు అధికంగా పెరగడంతో లాక్‌డౌన్‌ ప్రకటించినట్లు తహసీల్దార్‌ శ్రవణ్‌కుమార్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. వారం రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే చూడాలి మరి ఈ లాక్ డౌన్ ఆ ఒక్క మండలానికి పరిమితం అవుతుందా… లేదా రాష్ట్రం మొత్తం పెట్టాల్సి వస్తుందా… అనేది.

Related posts