telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాలం చెల్లిన బస్సులకు చెల్లు.. హైదరాబాద్ రోడ్లపైకి కొత్త బస్సులు!

passengers fire on tsrtc buses shortage

కాలం చెల్లిన బస్సులను తెలంగాణ ఆర్టీసీ పక్కన పెట్టనున్నది. హైదరాబాద్ నగర రోడ్లపై తిరుగుతున్న పాత బస్సుల స్థానంలో దశల వారీగా కొత్త బస్సులు రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియను టీఎస్ ఆర్టీసీ అధికారులు పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే నగరంలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో సుమారు 35 శాతం బస్సులు కాలపరిమితి ముగిసినవే. వీటిలో కాలుష్యాన్ని వెదజల్లే బస్సులతోపాటు ఫిట్‌నెస్‌లేని వాటిని పక్కన పెట్టనున్నారు. వీటి స్థానంలో 300 కొత్త బస్సులు రానున్నాయి.

ప్రతీరోజు గ్రేటర్ పరిధిలోని 29 డిపోల నుంచి 3వేల బస్సులు 10.6లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. 44,194 ట్రిప్పులు తిరుగుతూ 33లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఇంత భారీ డిమాండ్ ఉన్న నగరంలో పాత బస్సులు వెతలు మిగుల్చుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లపై మొరాయిస్తూ ట్రాఫిక్ ఇబ్బందులతోపాటు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాహన కాలుష్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే కొత్త బస్సులను త్వరలో రోడ్ల పైకి తీసుకురానుంది.

Related posts