telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆల్ ఔట్ అయిన భారత్… 241 ఆధిక్యంలో ఇంగ్లాండ్

చెన్నై లో జరుగుతున్న మొదటి టెస్ట్ లో నాలుగో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే భారత్ ఆల్ ఔట్ అయ్యింది.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 578 పరుగులు చేసి ఆల్ ఔట్ కాగా భారత్ 337 పరుగులకే కుప్ప కూలిపోయింది. అయితే నిన్న బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఆర్చర్ మొదట్లోనే రోహిత్(6) ఔట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ గిల్(29) కూడా ఆర్చర్ పెవిలియన్ కు చేర్చగా కోహ్లీ(11), రహానే(1) లను వెనక్కి పంపించి డోమ్ బెస్ భారత్ ను కష్టాలో నెట్టాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పంత్ తో కలిసి పుజారా నిలకడగా రాణించి 5వ వికెట్ కు 119 పరుగుల భాగసౌమ్యం నెలకొల్పారు. కానీ  73 పరుగుల వ్యక్తిగత  స్కోర్ వద్ద పుజారా క్యాచ్ రూపంలో పెవిలియన్ కు చేరుకోగా కాసేపటికే 91 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పంత్ ఔట్ అయ్యాడు. నిన్న మూడోరోజు ఆటముగిసే సరికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేయగా ఈరోజు మరో 80 పరుగులు చేసి ఆ నాలుగు వికెట్లు కోల్పోయింది. చివరికి భారత యువ స్పిన్నర్ సుందర్(85) నాట్ ఔట్ గా నిలిచాడు. అయితే భారత కంటే ఇంకా 241  పరుగుల ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ ఫాలోఆన్ ఎంచుకోలేదు. వారు తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఈరోజు బ్యాటింగ్ చేసి రేపు ఒక్కరోజులో భారత్ ను ఔట్ చేయాలనీ అంచనాలు వేసుకుంటున్నారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు.

Related posts