telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

రెండు రోజులు మారుతి ప్రొడక్షన్ నిలిపివేత!

Maruti-Suzuki symbol

ఉత్పత్తికి తగ్గ డిమాండ్ లేకపోవడంతో రెండు రోజుల పాటు ప్రొడక్షన్ ను నిలిపివేస్తున్నట్టు మారుతి సుజుకి ప్రకటించింది. ఈనెల 7, 9 తేదీల్లో గురుగావ్, మనెసార్ ప్లాంట్లను మూసివేయనున్నట్టు తెలిపింది. ఈ రెండు రోజులను ‘నో ప్రొడక్షన్ డే’గా ప్రకటించింది. ఉత్పత్తి నిలిపివేయడం వల్ల తాత్కాలిక ఉద్యోగులపై మాత్రమే ప్రభావం పడుతుందని యాజమాన్యం తెలిపింది.

గత నెలలో మారుతి అమ్మకాలు 33.7 శాతం తగ్గాయి. గత ఏడాది ఆగస్టులో 1,58,189 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఆగస్టులో 1,06,413 యూనిట్ల అమ్మకాలు జరిగినట్టు సంస్థ తెలిపింది. ఎగుమతులు సైతం ఆగస్టులో 10.8 శాతం పడిపోయాయని మారుతి సుజుకి పేర్కొంది.

Related posts