ఉంగుటూరులో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వైసీపీకి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం దుర్మార్గమని ఆయన చెప్పారు.వైసీపీ అరాచకాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దీనిపై ఏపీ డీజీపీ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దాడికి పాల్పడ్డ వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు వదిలేశారని, గాయపడిన బాధితులను అరెస్ట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఇటీవల స్థా నిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తోన్న టీడీపీ అభ్యర్థులపై కూడా దాడి చేశారని ఆయన చెప్పారు. నిందితులపై చర్యలు లేకుండా బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టడం హేయమని వ్యాఖ్యానించారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.