telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

పచ్చి పన్నీర్‌ తింటున్నారా..!

బ్రేక్‌ఫాస్ట్‌ ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తే…. మనం రోజంతా ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంటాం. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇక బ్రేక్‌ ఫాస్ట్‌లో పన్నీర్‌ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. డైటీషియన్ల ప్రకారం ప్రతి రోజూ పచ్చి పన్నీర్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయట. ఇందులో విటమిన్‌ డి, హెల్తీ ఫ్యాట్స్‌, కాల్షియం ఉంటాయి. అయితే.. పన్నీర్‌ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడ చూద్దాం.
ఎముకల కోసం : పచ్చి పన్నీర్‌ తీసుకోవడం వల్ల ఎముకలకు ఎంతో బలం చేకూరుతుంది. అందుకే రెగ్యూలర్‌గా పన్నీర్‌ తీసుకోవాలి. దీంతో పాటు జాయింట్‌ పెయిన్స్‌ కూడా తగ్గుతాయట.
జీర్ణవ్యవస్థ : ప్రతీ రోజూ పచ్చి పన్నీర్‌ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది. ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. ఉదర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
మానసిక ఆందోళన : బ్రేక్‌ఫాస్ట్‌ లో పచ్చి పన్నీర్‌ తీసుకోవడం వల్ల అలసట తగ్గుతుంది. మానసిక ఆందోళన కూడా తగ్గును.
గుండె ఆరోగ్యం : పచ్చి పన్నీర్‌ గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే ఐరన్స్‌, కాల్షియం, మెగ్నీషియం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గును. గుండెపోటు భయం కూడా తగ్గుతుంది.

Related posts