telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

పిల్లల ఆటలో … గెలుపోటములే చూస్తున్న .. నిర్లిప్త పోటీప్రపంచం.. వీళ్ళు మారరు..

viral news on children cricket result

క్రికెట్ ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు ఊహించలేం. ఇక్కడ ఇలాంటి మ్యాచ్ జరిగింది. ఓ జట్టు భారీ స్కోరు సాధించి సరికొత్త రికార్డు సృష్టిస్తే… ఇంకో జట్టు కేవలం 10 పరుగులు కూడా సాధించలేకుండా మరో రికార్డు సాధించింది. 11 మంది క్రికెట్ ప్లేయర్స్ కేవలం ఏడు పరుగుల ఎక్స్ ట్రాల రూపంలో సాధించిన డకౌట్ అయ్యారు. ముంబైలో జరిగిన ఇంటర్ స్కూల్ మ్యాచ్లో ఈ షాకింగ్ గణాంకాలు నమోదయ్యాయి. ముంబైకి చెందిన స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్, చిల్డ్రన్స్ వెల్ఫేర్ స్కూల్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ కు దిగిన స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు 39 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఏకంగా 761 పరుగులు చేసింది. ఈ జట్టులో ఒక ప్రేయర్ ఏకంగా 118 బంతుల్లో 338 పరుగులు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించారు.

ఈ భారీ ఛేదన లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన చిల్డ్రన్స్ వెల్ఫేర్ స్కూల్ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. అత్యంత చెత్త ప్రదర్శన చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 7 పరుగులు చేసి ఆలౌటైంది. అయితే ఈ జట్టులోని 11 మంది సభ్యులు అందరూ డకౌట్ గా నిలిచారు. ఆ 7 పరుగులు కూడా ఎక్స్ ట్రాల ద్వారా వచ్చినవే. ప్రస్తుతం ఈ మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఈ మ్యాచ్ లో ఒక జట్టు భారీ స్కోరు నమోదు చేసి రికార్డు సృష్టిస్తే… ఇంకో జట్టు అసలు స్కోరు నమోదు చేయకుండా రికార్డు సృష్టించింది. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఓటమి ఇది. సాధారణంగా ఆటలు శారీరక దారుఢ్యం కోసమే ఆడుతారు, కానీ ఇటీవల పనికిమాలిన పోటీ ప్రపంచం ఈ ప్రాథమిక విషయాన్నీ కూడా మరిచిపోయి, గెలుపు-ఓటములను మాత్రమే చూస్తూ, పిల్లలను కూడా వస్తువులుగా మార్చేస్తుంది. అది అందరూ గమనిస్తే వచ్చే తరాలైనా బాగుపడతాయి.

Related posts