telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విశ్వక్ సేన్ “పాగల్”… రానా క్లాప్

pagal

‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్’ ‘హిట్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇటీవల నేచురల్ స్టార్ నాని నిర్మించిన థ్రిల్లర్ ‘హిట్’ సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకున్నాడు విశ్వక్ సేన్.. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. తాజాగా విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నరేష్ కుప్పిలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, అభిరుచి గల నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ మూవీకి ‘పాగల్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. హీరోపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రానా దగ్గుబాటి క్లాప్ నివ్వగా, జెమిని కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దిల్ రాజు దర్శకుడికి స్క్రిప్ట్ అందచేశారు. త్రినాధరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. విశ్వక్ సేన్ నటిస్తున్న ఐదో సినిమా ఇది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

Related posts