telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రెండు రాష్ట్రాల మధ్య డేటా యుద్దం!

Chandrababu fire to CM KCR

హైదరాబాద్ కేంద్రంగా టీడీపీకి సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీలో తెలంగాణ పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య డేటా యుద్ధం మొదలైంది. బ్లూ ఫ్రాగ్ ఐటీ గ్రిడ్ సంస్థ ఏపీలోని ప్రజల డేటాను బహిర్గతం చేస్తోందన్న ఫిర్యాదుతో తెలంగాణ  పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ ఘటన పై స్పందించిన చంద్రబాబు కేసీఆర్ లక్ష్యంగా ఘాటు విమర్శలు గుప్పించారు. తమకు సేవ చేసే కంపెనీని లక్ష్యంగా చేసుకుని దాడులు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నామని తెలిపారు. 

అనవసరంగా మీరు రెచ్చిపోతే మేము కూడా రెచ్చిపోవాల్సి వస్తుందని చంద్రబాబు కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. తమ డేటాను తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు సేవ చేసే కంపెనీపై తెలంగాణ ఏసీబీ పోలీసులు వచ్చి దౌర్జన్యం చేస్తారా అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఓ పక్క నరేంద్ర మోదీ దాడులు చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తే మరో పక్క కేసీఆర్ మన ఆస్తులపైన దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు. ఈ రెండూ కూడా ఎంతోకాలం సాగవు. ఈ విషయాన్ని అంతా తేలికగా విదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Related posts