రానున్న శాసనసభ ఎన్నికల్లో కొవ్వూరు నుంచే మళ్లీ పోటీ చేస్తానని ఏపీ మంత్రి జవహర్ ప్రకటించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లలో బీజేపీకి ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కదని జోస్యం చెప్పారు. అసలు ఏపీకి ఏ హక్కుతో మోదీ వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కొందరు అహంకారంతో చేసే పనులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
టీడీపీలో కొందరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మంత్రి మండిపడ్డారు. వారి సంగతి పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. జగన్-కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారనీ వారి డ్రామాలు ఇక్కడ పని చేయవని విమర్శించారు. ఈ రోజు సీఎం చంద్రబాబు నివాసం దగ్గర కొవ్వూరు నియోజకవర్గ నేతల సమావేశం రసాభాసగా మారింది. మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జవహర్‌కు మళ్లీ టికెట్ ఇవ్వొద్దని నినాదాలు చేశారు.