telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆ ఓట్లు ఎక్కవగా ఉండడం బాధాకరం : రామచందర్‌రావు

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగిన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్‌రావు.. తన విజయం పై ధీమా వ్యక్తం  చేస్తూనే ఉన్నారు.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి ఆధిక్యాన్ని కనబరుస్తూ వస్తున్నారు.. అయితే, రెండో స్థానంలో కొనసాగుతోన్న బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు.. టీఆర్ఎస్ అభ్యర్థికి మధ్య మాత్రం పెద్దగా గ్యాప్ లేదు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో మాట్లాడిన రామచందర్ రావు.. టీఆర్ఎస్‌కి తనకు మధ్య ఓట్లలో పెద్ద తేడా లేదని.. చివరికి వచ్చే వరకు నేనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.. అయితే, మేం అనుకున్న విధంగా మాకు ఓట్లు పడలేదన్న ఆయన.. ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసిందని మండిపడ్డారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ఈ అంశం పై మాట్లాడుతానని తెలిపారు. మరోవైపు.. చెల్లని ఓట్లు ఎక్కవగా ఉండడం బాధాకరం అన్నారు రామచందర్ రావు.. మా ప్రచారంలో ఓటు ఎలా వేయాలి అనే దాని పై వివరించాం.. అయిన ఓటును కరెక్ట్ గా వేయలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చూడాలి మరి ఈ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts