telugu navyamedia
రాజకీయ వార్తలు

నేడు భారత్-చైనా దేశాల మధ్య మరోసారి చర్చలు

india-china-meating

భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను అదుపు చేసేందుకు ఇరు దేశాలు నేడు మరోసారి చర్చలు జరపనున్నాయి. తూర్పు లడఖ్‌లోని అధీనరేఖ వెంబడి భారత భూభాగం వైపున ఉన్న చుసూల్‌లో ఇరు దేశ సైన్యాల లెఫ్టినెంట్ జనరళ్లు నేడు సమావేశం కానున్నారు.

ఈ సమావేశంలో బలగాల ఉపసంహరణతోపాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చడంపైనే ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన విధివిధానాలు కూడా ఖరారు చేయనున్నారు. కాగా, ఇటీవల జరిగిన చర్చల ఫలితంగాగోగ్రా, హాట్ స్ప్రింగ్స్, గల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు సైన్యం వెనుదిరిగాయి.

Related posts