telugu navyamedia
క్రీడలు వార్తలు

అలా చేస్తేనే ధోని రాణించగలడు…

sunil gavaskar on bcci

కరోనా కారణంగా యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 చివరి దశకు చేరుకుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. ఆ జట్టు కెప్టెన్ ధోని కూడా బ్యాటింగ్ లో అంతగా రాణించలేదు. మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన ధోని కేవలం 200 పరుగులు మాత్రమే చేసాడు. ధోని ఆటతీరు పై స్పందించిన భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అతను డొమెస్టిక్ క్రికెట్ లో ఆడాలి అన్నారు. అయితే ఐపీఎల్ లీగ్ లో చెన్నై ప్లే ఆఫ్ కి వెళ్ళకపోవడం ఇదే మొదటిసారి. కాబట్టి వచ్చే ఏడాది అయిన చెన్నై జట్టుతో పాటుగా ధోని కూడా రాణించాలంటే అతను మ్యాచ్ లు ఆడాలి. కానీ ధోని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో… వచ్చే ఐపీఎల్ వరకు నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం మాత్రమే కాకుండా దేశవాళీ మ్యాచ్ లలో పాల్గొంటే బాగుంటుంది అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ఐపీఎల్ తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అన్ని చాలా వార్తలు వచ్చిన… నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ టాస్ సమయంలో ఇది నా చివరి మ్యాచ్ కాదు అని క్లారిటీ ఇచ్చాడు. అయితే నిన్నటి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లు ముగిసే సమయానికి మరో వికెట్ పడకుండా 153 పరుగులు చేసింది. ఇందులో దీపక్ హుడా కేవలం 30 బంతుల్లో 4 సిక్స్ లు, 3 ఫోర్లతో 62 పరుగులు సాధించాడు. ఇక 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన చెన్నై మొదటి నుండి విజయం వైపుకే పరుగులు తీసింది. ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్(48) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరుకున్న తర్వాత వచ్చిన అంబటి రాయుడు (30) తో కలిసి మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (62) జట్టుకు విజయాన్ని అందించాడు.

Related posts