టిక్‌టాక్ చూడొద్దని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన కూతురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైద్రాబాద్ నగరంలోని రామాంతపూర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రామాంతపూర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక టిక్‌టాక్‌కు బానిసైంది. అలాగే అదేపనిగా సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడేది.
కూతురు సెల్ ఫోన్ ను గమనించిన తల్లి అస్తమానం టిక్‌టాక్ ఏంటని కోప్పడింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక గురువారం ఇంట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల వీఐపీ దర్శనాలపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు!