telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

రక్తం కక్కుతూ ఆకాశం నుంచి ఒక్కసారిగా పడిపోయిన 80 పక్షులు… హార్రర్

Dozens of corellas dead after falling from sky in suspected poisoning

ఆస్ట్రేలియాలో ఓ ప్రైమరీ స్కూలు ప్రాంగణంలో ఆకాశం నుంచి ఉన్నట్టుండి దాదాపు 80 పక్షులు ఒక్కసారిగా నేలపై పడిన భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా స్కూల్ పిల్లలు భయాందోళనలకు గురయ్యారు. కింద పడిన పక్షుల నోట్లో నుంచి రక్తం… ఈ అనుసమానాస్పద ఘటనలో కొన్ని పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. మిగతా పక్షులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రైమరీ స్కూలు యాజమాన్యం ఈ ఘటన గురించి తమ ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి గురైన పక్షులన్నీ కొరెల్లా అనే రక్షిత జాతికి చెందిన పక్షులుగా అధికారులు గుర్తించారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం వీటికి ఎటువంటి రక్షణ కల్పించడం లేదని వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఈ పక్షులు మౌలిక సదుపాయాలను నాశనం చేస్తున్నాయంటూ ఓ లోకల్ కౌన్సిల్ వీటికి ప్రాణాంతక వాయువు ఇచ్చి చంపాలని కూడా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే చనిపోయిన పక్షులలో ఎటువంటి ప్రాణాంతక వాయువులు లభించలేదని వైద్యులు నిర్ధారించారు. పక్షులు ఎందుకు చనిపోయాయి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Related posts