తెలంగాణలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా సోకిన వార్త తెలిసిన మర్నాడే సిద్ధిపేటలో మంత్రి పీఏకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు.
దీంతో అప్రమత్తమైన అధికారులు మంత్రి, ఆయన వెంట ఉండే 51 మంది నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు. అయితే, ఈ ఫలితాల్లో మంత్రి సహా 17 మందికి నెగటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. మరోవైపు, ముందు జాగ్రత్త చర్యగా మంత్రి హరీశ్‌రావు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా, జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.