telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆ స్మగ్లింగ్ కు టీటీడీకి సంబంధం లేదు : ధర్మారెడ్డి

టీటీడీ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థల మధ్య తలనీలాలను భద్రపరుస్తుందని…ప్రాసెస్ చేసిన తలనీలాలు పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో విక్రయాలు జరుపుతాము. కాబట్టి మిజోరంలో పట్టుబడిన తలనీలాలకు టిటిడి కి ఎలాంటి సంబంధం లేదన్నారు టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి. కస్టమ్స్ అధికారులు అన్ ప్రాసెస్డ్ తలనీలాలు పట్టుకున్నట్లు రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారని వాటి విలువ 18 లక్షల రూపాయలు అని కూడా రిపోర్టులో పేర్కా న్నారన్నారు దర్మారెడ్డి. కస్టమ్స్ రిపోర్ట్ చూస్తే వారు పట్టుకున్న తలనీలాలు టీటీడీ విక్రయించినవి కూడా కాదు అని తేలిపోయిందన్నారు. కస్టమ్స్ రిపోర్టులో కూడా స్మగ్లింగ్ చేస్తున్న తలనీలాలుకు… టీటీడీకి సంబంధం ఉన్నట్లు ఎక్కడా పేర్కొనలేదు అన్నారు ధర్మారెడ్డి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కొంతమంది సోషల్ మీడియాలో మీడియాలో టిటిడిపై దుష్ప్రచారం చేస్తున్నారని అలా చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు ధర్మారెడ్డి.

Related posts