telugu navyamedia
రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

మరోసారి పెరిగిన పెట్రో ధరలు.. లీటరుకు 58 పైసల పెంపు

petrol bunk hyd

కరోనా సంక్షోభం నేపథ్యంలో పెట్రో ధరలు వరుసగా ఏడో రోజు కూడా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 58 పైసలు, డీజిల్‌పై లీటరుకు 59 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో వారం రోజుల్లోనే పెట్రోలు ధర లీటరుకు రూ.3.90 పెరగ్గా, డీజిల్‌పై లీటరుకు రూ. 4.01 పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 75.16కి చేరగా, డీజిల్ రూ. 73.39కి చేరుకుంది.

ఇక ముంబైలో లీటరు పెట్రోలు రూ. 82.10కి పెరగగా, డీజిల్‌ రూ.72.03కి పెరిగింది. చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 78.99గా ఉండగా, డీజిల్ ధర రూ. 71.64గా ఉంది. ఇక, బెంగళూరులో లీటరు పెట్రోలు ధర రూ. 77.59కి పెరగ్గా, డీజిల్ ధర రూ. 69.78కి పెరిగింది.

Related posts