టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు సొంత పార్టీ నేతల వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు మెప్పు కోసమే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆందోళనకు దిగారని ఆయన విమర్శించారు. ఇకనైనా పార్టీ అధినేతకు భజన చేయడాన్ని టీడీపీ నేతలు మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు మారకపోతే ప్రనజలు క్షమించరని హెచ్చరించారు. టీడీపీ నేతలు ప్రజావేదిక విషయంలో ఆందోళన నిర్వహిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయని ఆయన తెలిపారు.
సీఎం జగన్ ఇతర అక్రమ నిర్మాణాల విషయంలో కూడా ఇలాగే స్పందించాలని తోట డిమాండ్ చేశారు. సొంత పార్టీ వారిని తోట విమర్శిస్తుండటంతో.. పార్టీ వీడటంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పకనే చెప్పినట్టుగా ప్రచారం జోరుగా సాగుతుంది.