telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చిత్తూరు జిల్లాలో అరుదైన పక్షి…!

Rare

చిత్తూరు జిల్లాలో అరుదైన పక్షి కనిపించింది. ఈ పక్షి ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. బి.కొత్తకోట మండలం డేగాని పల్లిలో స్థానికులకు పొలాల్లో దూరంగా ఏదో విచిత్రమైన పక్షి కనిపించింది. పంట పొలాలు కావడంతో ముందు కుందేలుగా భావించారు. కానీ ఆకారం చూస్తే కాస్త తేడాగా కనిపించింది. తీరా చూస్తే కుందేలు కాదు పెద్ద పక్షిలా కనిపించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడూ ఎక్కడా కనిపించలేదు. ఇద్దరు కుర్రాళ్లు ధైర్యంగా ముందుకు వెళ్లి దానిని పట్టుకున్నారు. పక్షిని చూస్తే వారికి పెద్ద గద్దలా కనిపించింది. ఇది పురాణాల్లో చెప్పిన గరుడ పక్షని అనుకున్నారు. అయితే ఓ వ్యక్తి ఇది అక్విలిన్ (aquiline) జాతి పక్షి అన్నాడు. చాలా అరుదైన పక్షి కావడంతో స్థానికులంతా ఎగబడి చూశారు.. కొందరు సెల్ఫీలు కూడా దిగారు. తర్వాత జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్లీ పొలాల్లోనే వదిలేశారు. ఆ పక్షి అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్లిపోయింది.

Related posts