telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

హన్మంత రావు కు బెదిరింపు కాల్స్…

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ పేరు ఖరారు అయిందనే ప్రచారం జరగడంతో.. రేవంత్ వ్యతిరేకులు మండిపడుతున్నారు. పార్టీ సీనియర్ నేత  హన్మంత రావు… రేవంత్ కి పదవి ఎలా ఇస్తారు..? అని ప్రశ్నించారు. రైతు ర్యాలీకి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు కొద్దీ మంది ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి… రేవంత్ టీం లోని కొందరు నాయకులు ఢిల్లీలోనే మకాం వేశారు. ఒకటి…రెండు రోజుల్లో  పీసీసీ చీఫ్ ప్రకటన అధికారికంగా రాబోతుందని చర్చ జరుగుతున్న క్రమంలో అందరూ ఆఖరి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే పదవుల కూర్పుకు సంబందించి… పార్టీ నాయకులు ఎవరికి వారు లెక్కలు వేస్తున్నారు. రేవంత్… సీఎల్పీ నేత భట్టి మధ్యనే ప్రధాన పోటీ ఉన్న నేపథ్యంలో ఎవరికి పీసీసీ ఇస్తారు. .? ఎవరిని నచ్చ చెప్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పార్టీలో సీనియర్లు అంతా ఒక అభిప్రాయంతో ఉన్నారు. రేవంత్ కి పార్టీ పగ్గాలు ఇస్తే…సీనియర్లు ఉంటారా..? బయటకు వెళ్తారా. ? అనే చర్చ జరుగుతోంది.  దీనికి హన్మంత రావు బీజం వేశారు. అయితే ఇలా వీహెచ్ మీడియా ముందుకు వచ్చారో లేదో ఆయనకి బెదిరింపు కాల్స్ మొదలయ్యాయి. రేవంత్ గురించి మాట్లాడితే చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అసభ్య పదజాలంతో గుర్తు తెలియని వ్యక్తి దూషించినట్టు చెబుతున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో విహెచ్ ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు విహెచ్. చూడాలి మరి ఇది ఇంకా ఎంత దూరం పోతుంది అనేది.

Related posts