telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఈ ఖర్జురా కల్లు ఎంత ఫేమస్సో.. ఎమ్మెల్యేలే లైన్‌ పడుతున్నారు !

తెలంగాణ కల్లుకు ఎక్కువగా ఫేమస్‌. ఎంత రేటు ఉన్నా.. అది ఎంత దూరంగా ఉన్నా కల్లు బాగుందనే టాక్‌ ఉంటే చాలు. ఆ ప్లేస్‌లో వాలిపోతారు కల్లు ప్రియులు. ఇప్పటికే తెలంగాణలో పలు చోట్ల కల్లు చికెన్‌ ఫేమస్‌ కాగా.. తాజాగా ఖర్జూర కల్లు వెలుగులోకి వచ్చింది. ఈత కల్లు వద్దు ఖర్జూర కల్లే ముద్దు అంటున్నారట. అంతే ఫేమస్‌ అయిపోయింది ఈ ఖర్జుర కల్లు. ఆ ఖర్జూర కల్లు ఎక్కడో కాదండీ.. హైదరాబాద్‌కు సరిగ్గా 120 కిమీ దూరంలో నాగర్‌ కర్నూలోని తర్నికల్‌ లో ఈ ఖర్జూర కల్లు దొరుకుతోంది. పొద్దున ఆ ఊరికి వెళ్తే.. రోడ్డు పక్కనే కార్లు, బైక్‌లు పార్క్‌ చేసి ఉంటాయి. అందరి అడుగులూ కుండలు వేలాడుతున్న ఖర్జూర చెట్ల వైపు పడుతుంటాయి. అదే యాదయ్య గౌడ్‌ ఖర్జూర తోట. మొదటి సారిగా ఖర్జూర కల్లును పరిచయం చేశాడు యాదయ్య. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా నుంచి ఖర్జూర మొక్కలు తెప్పించి..రెండెకరాల్లో మొక్కలు నాటాడు యాదయ్య. ఆ ఖర్జూర తోటను తన బిడ్డలాగా చూసుకుని… పండించాడు. దీంతో ఖర్జూర చెట్లు బాగా అభివృద్ధి చెందాయి. ఆ చెట్ల నుంచి వచ్చే కల్లు అమ్ముకుంటూ… ఏకంగా 27 బోర్లు వేశాడు యాదయ్య. అంతేకాదు.. ఖర్జూర కల్లు అమ్మి…తన కూతురు పెళ్లి కూడా చేశాడు. రోజుకు 1200 నుంచి 2000 వరకు ఈ కల్లు ద్వారా సంపాదిస్తున్నాడు యాదయ్య. ఈ కల్లు కోసం హైదరాబాద్‌ నుంచి వస్తారట కల్లు ప్రియులు. ఇక ఈ కల్లు తాగితే.. జలుబు, దగ్గు కూడా తగ్గుతాయని వాళ్ల నమ్మకం. దీంతో జలుబు, దగ్గు వచ్చిన వాళ్లు కూడా ఈ కల్లు కోసం ఎగబడుతున్నారు.

Related posts