telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ప్రభాస్ పక్కన సీతగా..?

Kiara

బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్‌లోనే ఉన్నాయి. ఈయన సినిమాల కోసం అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారిప్పుడు. దాంతో బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను కూడా ఇప్పుడు ప్రభాస్‌పైనే ఉంది. ఈయన కోసమే ప్రత్యేకంగా కథలు కూడా సిద్ధం చేస్తున్నారు. అలా చేసిన ఓ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’. తానాజీ దర్శకుడు ఓం రౌత్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన క్షణం నుంచి సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది.ఈ చిత్రం హీరోయిన్ విషయమై గత రెండు మూడు రోజులుగా తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. మహానటి ఫేం కీర్తి సురేష్ ను ప్రభాస్ కు జోడీగా ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రభాస్ రాముడిగా కీర్తి సురేష్ సీతగా కనిపించనున్నట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుందని టాక్. సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కు కూడా బాగా నచ్చిన ముద్దుగుమ్మ కియారా అద్వానీని సీత పాత్ర కోసం తీసుకునే యోచనలో ఉన్నారట.తెలుగులో భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ చిత్రాల్లో నటించిన ఈమె ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయ్యింది. ముఖ్యంగా కబీర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా ఈమె స్టార్ డం పెరిగి పోయింది. ఆ కారణంగానే ఈమెను ఆదిపురుష్ చిత్రంలో సీత పాత్రకు తీసుకుంటే బాగుంటుందనే నిర్ణయంలో మేకర్స్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి.చూడాలి మరి ఎం జరుగుతుందో .

Related posts