telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఫిబ్రవరి 12 నుంచి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం…

సీఎం మార్పు అంటూ నేతలు మాట్లాడుతున్న తీరుపై సమావేశంలో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు .వరుసగా సీఎం మార్పుపై నేతలు మాట్లాడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు.నేనే సీఎంగా ఉంటానని నేతలకు తేల్చి చెప్పారు కేసీఆర్. ఇకపై ఎవరైనా ఈ అంశంపై మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కేసీఆర్. అంతే కాక నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానన్న ఆయన ఎవరూ నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని అన్నారు. నా ఆరోగ్యం సహకరించకుంటే నేనే చెప్తా అప్పుడు ఎవర్ని సీఎం చేయాలన్నది మీతోనే మాట్లాడతా అని కేసీఆర్ అన్నారు. మీకంటే ఆత్మీయులు నాకెవ్వరూ లేరని అన్నారు. పార్టీ లైన్‌కు భిన్నంగా మాట్లాడితే చర్యలు తప్పవని కేసీఆర్ అనారు. అసెంబ్లీ సాక్షిగా నేనే సీఎం అని చెప్పా అని కూడా అన్నారు. ఇక ఇటు పార్టీ సంస్థాగత నిర్మాణం పై నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.ఫిబ్రవరి 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టిఆర్ఎస్ ప్రారంభిస్తుంది. ఫిబ్రవరి నెలాఖరు లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని నేతలకు డెడ్ లైన్ పెట్టారు కేసీఆర్. ఇక మార్చి నెలలో గ్రామ స్థాయి నుంచి…జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తారు.ఏప్రిల్ నెలలో రాష్ట్ర కమిటీ ఏర్పాటుతో పాటు…పార్టీ ప్లీనరీ నిర్వహిస్తారు.ఇటు ఏ జిల్లా నాయకులు ముందుకు వస్తే ఆ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తామని సమావేశంలో కేసీఆర్ అన్నట్లు సమాచారం.

Related posts