telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

పట్టాలేక్కనున్న ప్రైవేటు రైళ్లు..హైదరాబాద్ నుంచి తిరుపతి!

10 winter trains between jaipur-renigunta

దేశవ్యాప్తంగా 100 మార్గాల్లో 150 ప్రైవేటు రైళ్లు పట్టాలేక్కనున్నాయి. ప్రైవేటు రైళ్లను నడిపించేందుకు రైల్వే శాఖ సంసిద్దమైంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో తొలి రైలు హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లి నుంచి తిరుపతి మధ్య నడవనుంది. ఐదు నెలల క్రితం న్యూఢిల్లీ నుంచి లక్నో మధ్య, ఆపై ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య తేజస్ రైళ్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అతి త్వరలో ఇండోర్ నుంచి వారణాసి మధ్య కూడా తేజస్ నడవనుంది. ఈ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది.

సాంకేతికలోపంతో రైలు గమ్యాన్ని చేరడంలో జాప్యం జరిగితే, ప్రయాణికులకు రూ. 250 వరకూ పరిహారం లభిస్తుంది. ఈ పరిహారాన్ని రైలును లీజుకు తీసుకున్న సంస్థకు బదులుగా, ఐఆర్సీటీసీ ఇవ్వాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ఐఆర్సీటీసీపై భారాన్ని తొలగించేందుకు ప్రైవేటు రైళ్లు వస్తుంటే, మిగతా రైళ్లను మరింత ఆలస్యంగా నడిపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 ప్రైవేటు రైళ్లకు అనుమతి లభించగా, తొలి టెండర్ తిరుపతికి ప్రయాణించే రైలుకు పిలవాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం.

Related posts