telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మరో ప్యాకేజీ తీసుకొచ్చిన అమెరికా ప్రభుత్వం…

Joe Biden USA

దాదాపు ఏడాదికి పైగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే అమెరికాలో ఈ వైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.  కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంది.  100 రోజులపాటు మాస్క్ ను తప్పనిసరి చేసింది.  భౌతిక దూరం పాటించాలని జో బైడెన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదేశాలు జారీ చేశారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని తీసుకొచ్చారు.  కాగా, ఇప్పుడు మరో 2.3 ట్రిలియన్ డాలర్లతో మరో ప్యాకేజీని తీసుకొచ్చారు.  మౌళిక సదుపాయాల రంగానికి ఉద్దీపన కలిగించేలా ఈ ప్యాకేజీ ఉంటుందని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.  ఇందులో 621 బిలియన్ డాలర్లు రవాణా రంగం అభివృద్ధికి, 400 బిలియన్ డాలర్లను వృద్దులు, వికలాంగ అమెరికన్ల రక్షణ కోసం, 300 బిలియన్ డాలర్లను తాగునీరు, బ్రాడ్ బ్యాండ్, ఎలక్ట్రిక్ గ్రిడ్ అప్ గ్రేట్ చేయడం కోసం వినియోగించనున్నారు. అయితే చూడాలి మరి అక్కడ ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts