telugu navyamedia
క్రీడలు వార్తలు

ముంబై కి వార్నింగ్ ఇచ్చిన భారత మాజీ స్పిన్నర్…

మ్యాచ్‌ ముంగిట ముంబై జట్టుకు భారత మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా ఓ చిన్న వార్నింగ్ ఇచ్చాడు. ఓవర్ కాన్ఫిడెంట్‌తో మ్యాచ్‌లు ఆడొద్దని సూచించాడు. తాజాగా ప్రగ్యాన్ ఓజా మాట్లాడుతూ… ‘ముంబై జట్టు పటిష్టంగా ఉంది. మంచి సమతూకంతో కనిపిస్తోంది. గత రెండేళ్లుగా జట్టులో పెద్దగా మార్పులు జరగలేదు. ఈ ఏడాది మినీ వేలంలో కూడా రెండు మూడు స్థానాల్ని భర్తీ చేసుకునేందుకే ప్రాధాన్యమిచ్చింది. ఎందుకంటే.. ఆ జట్టు ఇప్పటికే అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. వరుసగా 2019, 2020లో టైటిల్ గెలవడం ద్వారా ముంబై టీమ్ ఇప్పుడు మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. విశ్వాసం ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్‌తో మాత్రం మ్యాచులు ఆడకూడదు’ అని ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 13 సీజన్లు జరిగాయి. ముంబై ఇండియన్స్ వరుసగా 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. ఈ టైటిల్స్ అన్నీ కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ముంబై గెలవడం విశేషం. ఒకవేళ ఈ ఏడాది కూడా టైటిల్‌ని గెలిస్తే.. టోర్నీ చరిత్రలో హ్యాట్రిక్ కొట్టిన ఏకైక జట్టుగా ముంబై నిలవనుంది.

Related posts