telugu navyamedia
క్రీడలు వార్తలు

డబ్ల్యూటీసీ ఫైనల్ లో వారిదే విజయం అంటున్న కోహ్లీ…

జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ కోసం 14 రోజుల హార్డ్ క్వారంటైన్ పూర్తి చేసుకున్న కోహ్లీసేన.. ఈ రాత్రికి ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కనుంది. ఈ నేపథ్యంలో కోచ్ రవిశాస్త్రితో కలిసి మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్ మాకు సవాల్‌తో కూడుకున్నదే. కానీ ఇది గత కొన్నేళ్లుగా మేం సాధించిన విజయాలను ఆస్వాదించాల్సిన సమయం. ఈ మెగా ఫైనల్ నేపథ్యంతో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. భవిష్యత్తులో కూడా ఉండదు. ఇది కేవలం ఫైనల్ మాత్రమే. పూర్తిగా ఆస్వాదించాల్సిన సమయం ఇది.’అని విరాట్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌లోని పరిస్థితులు ఇరు జట్లకు సమంగా ఉంటాయన్నాడు. న్యూజిలాండ్‌కు అడ్వాంటేజ్ ఉంటుందన్న వ్యాఖ్యలను కోహ్లీ కొట్టిపారేశాడు. ఎవరు బాగా ఆడితే వారినే విజయం వరిస్తుందని తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఇదే జరిగిందని గుర్తు చేశాడు. ‘ఇంగ్లండ్‌లోని పరిస్థితులు న్యూజిలాండ్‌తో పాటు మాకు ఒకేలా ఉంటాయి. ఇరు జట్లకు సమాన అవకాశాలుంటాయనే దృక్పథంతోనే అక్కడికి వెళ్తున్నాం. ఎవరు క్రికెట్ బాగా ఆడితే వారినే విజయం వరిస్తుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఇదే జరిగింది.’అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక మెగా ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌తో ఆడుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్ వల్ల న్యూజిలాండ్‌కు పెద్ద అడ్వాంటేజ్ ఏం ఉండదని తెలిపాడు.

Related posts