telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇక క్రికెట్ లో సింగిల్స్ ఉండవేమో : ద్రావిడ్

తాజాగా ఎంఐటీ క్రీడా విశ్లేషణ సదస్సులో రాహుల్ ద్రవిడ్ సహా టీమిండియా మాజీ కోచ్‌, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ గ్యారీ కిర్‌స్టన్‌.. ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ క్రీడాకారిణి ఇషా గుహ సదస్సులో పాల్గొన్నారు. ఆటగాళ్లు సాధన చేసేందుకు.. ఫిట్‌గా ఉండేందుకు.. బౌండరీలు, సిక్సర్లు బాదేందుకు ఇంకా మరెన్నో అంశాల్లో డేటా ఎలా ఉపయోగపడుతుందో అని వీరు చర్చించారు. బాస్కెట్‌ బాల్‌లోని 3 పాయింట్‌ రెవల్యూషన తరహాలోనే క్రికెట్లో డేటా ప్రయోజనాలు ఉంటాయని ముగ్గురూ స్పష్టం చేశారు. ‘క్రికెట్ ఆటలో సింగిల్స్‌ను తిరస్కరించే రోజులు మరెంతో దూరంలో లేవు. ఎందుకంటే ప్రతి రెండు, మూడు బంతులకో సిక్సర్‌ బాదే పరిస్థితులు వచ్చేశాయి. క్రికెట్లో బ్యాటు, బంతికి నడుమ పోటీని డేటా నడిపించనుంది’ అని రాహుల్ ద్రవిడ్‌ అన్నారు. ‘టీ20ల్లో ప్రతి బంతికీ ప్రాముఖ్యం ఏర్పడింది. కొత్త కుర్రాళ్లు మెరుగైన సాంకేతికత కారణంగా ప్రత్యర్థి ఆటగాళ్ల బలాబలాలను విశ్లేషించుకొని ప్రతిదాడి చేస్తున్నారు అని ఇషా గుహ తెలిపారు.

Related posts