ప్రభుత్వ వజ్రపు గనుల వెలికితీత సంస్థ అల్ రోసా పీజేఎస్సీ నిర్వహిస్తున్న గనుల్లో మరో సరికొత్త వజ్రం దొరికింది. వజ్రం గర్భంలో మరో వజ్రం అటూ ఇటూ స్వేచ్ఛగా కదులుతూ ఉండటం గమనార్హం. ఈ వజ్రం దాదాపు 800 మిలియన్ సంవత్సరాల నాటిది అయివుండవచ్చని అల్ రోసా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తరహా వజ్రం కనిపించడం ఇదే తొలిసారని, దీన్ని ‘మట్రోష్కా డైమండ్’గా వ్యవహరిస్తారని తెలిపింది.
ఈ వజ్రం 0.62 క్యారెట్లుండగా, లోపలున్న వజ్రం 0.02 క్యారెట్లుందని వెల్లడించింది. ప్రకఅతి ఎన్నో రహస్యాలను దాచుకుని ఉందని, వాటిల్లో మానవాళికి తెలియనివే అత్యధికమని చెప్పడానికి ఇదో ఉదాహరణని అభిప్రాయపడింది.