telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పోలవరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

KCR cm telangana

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ముంచే పోలవరం ప్రాజెక్టు వద్దని ఆనాడు వ్యతిరేకించామని తెలిపారు. ఇందిరా సాగర్ పేరుతో పోలవరం ప్రాజెక్టును ప్రతిపాదించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ విషయం రికార్డుల్లో ఉందని, కావాలంటే చూసుకోవాలని విపక్షాలకు సూచించారు.

ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో కేసీఆర్, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం సాగింది. దివాలా తీసిన ప్రభుత్వం తీరులో బడ్జెట్ ఉందని భట్టి విమర్శించడం పై  కేసీఆర్   స్పందిస్తూ ఓవైపు ప్రాజెక్టులు పూర్తవుతున్నా చూడలేని కళ్లు ఉన్న కబోదుల్లా తయారయ్యారంటూ  విపక్ష నేతపై  ధ్వజమెత్తారు. 

Related posts